పంజాబ్‌లో వరద బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి నిరసన ప్రదర్శనకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ ముందస్తు అరెస్టులు చేసింది. 16 రైతు సంఘాలకు చెందిన నేతల్ని అదుపులోకి తీసుకున్నది. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేతృత్వంలోని నేతల్ని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కేఎంఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వన్ సింగ్ పందేర్, ప్రెస్ సెక్రటరీ బల్దీప్ సింగ్, బీకేయూ నేత కన్వర్‌దిలీప్ సింగ్, కార్యదర్శి చామ్‌కౌర్ సింగ్, బోర్ సింగ్‌లు ఉన్నారు. ఇంకా మరికొంత మంది నేతల్ని అరెస్టు చేసేందుకు రెయిడ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరద బాధిత రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడంలేదని ఆగస్టు 22 నుంచి రైతు సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టేందుకు సిద్ధం అయ్యాయి. అయితే ముందస్తుగా జరుగుతున్న అరెస్టులను రైతు నేతలు ఖండించారు.
రైతు సంఘాల నేతలు అరెస్టు !
August 21, 2023
0
Tags