అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

Telugu Lo Computer
0


అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5.40 గంటల ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5గా నమోదైనట్లు తెలిపింది. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, జులై 29వ తేదీన అర్ధరాత్రి అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్‌ సమీపంలో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భూ కంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)