వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా తాజాగా వన్డే సిరీస్ లోనూ అదరగొట్టింది. రెండో వన్డేలో ఓడి అభిమానులను నిరాశ పరిచిన భారత్ మూడో వన్డేలో అదిరిపోయే ప్రదర్శన చేసింది. భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో టీమిండియా భారీ విజయంతో సిరీస్ సొంతం చేసుకొంది. వెస్టిండీస్ పై 200 పరుగుల భారీ తేడాతో టీమిండియా నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగుల భారీ స్కోరును సాధించింది. శుబ్ మన్ గిల్ (92 బంతుల్లో 85; 11 ఫోర్లు) మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 77; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) హ్యాట్రిక్ అర్ధ శతకాలను పూర్తి చేశాడు. సంజూ సామ్సన్ (51) రాణించాడు. హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) చివర్లో దంచి కొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ఓపెనర్లు మరోసారి శుభారంభం చేశారు. గిల్, ఇషాన్ కిషన్ లు తొలి వికెట్ కు 143 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ భారీ షాట్స్ ఆడాడు. మరో ఎండ్ లో శుబ్ మన్ గిల్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. అర్ధ సెంచరీ అనంతరం భారీ షాట్ కు ప్రయత్నించి ఇషాన్ కిషన్ స్టంపౌట్ అయ్యాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (8) విఫలం అయ్యాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సంజూ సామ్సన్ సత్తా చాటాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకు కుప్పకూలింది. శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతో చెలరేగాడు. ముకేశ్ కుమార్ 3 వికెట్లు సాధించాడు. కుల్దీప్ యాదవ్ కు 2 వికెట్లు దక్కాయి. 10వ నెంబర్ ప్లేయర్ మోటీ (39 నాటౌట్) టాప్ స్కోరర్ గా నిలవడం విండీస్ బ్యాటింగ్ వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అథనాజ్ (32) ఫర్వాలేదనిపించాడు. ఆగస్టు 3వ తేదీ నుంచి ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. https://t.me/offerbazaramzon
మూడో వన్డేలో టీమిండియా భారీ విజయం
August 02, 2023
0
Tags