రాబర్ట్‌ వాద్రా బెయిల్‌ షరతులు పాటించడం లేదు !

Telugu Lo Computer
0


నీలాండరింగ్‌ కేసుకు సంబంధించి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు గతంలో ముందస్తు బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. దీనిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది. రాబర్ట్‌ వాద్రా బెయిల్‌ షరతులను పాటించడం లేదని అందులో పేర్కొంది. వీటిని నిరూపించేందుకు సరైన ఆధారాలతో కూడిన అదనపు అఫిడవిట్‌ దాఖలు చేస్తామని, అందుకు కొంత సమయం కావాలని కోర్టును ఈడీ కోరింది. రాబర్ట్‌ వాద్రాకు ఏప్రిల్‌ 1, 2019లో ట్రయల్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌ లభించింది. దీనిని సవాలు చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారణ సందర్భంగా.. మనీ లాండరింగ్‌తో రాబర్ట్‌ వాద్రాకు నేరుగా సంబంధం ఉందని, దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని ఈడీ వాదించింది. అందుకే ఆయన్ను విచారించేందుకు కస్టడీ కోరుతున్నామని తెలిపింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన రాబర్ట్‌ తరఫు న్యాయవాది.. దర్యాప్తు సంస్థ సమన్లు ఇచ్చినప్పుడల్లా హాజరవుతున్నారని పేర్కొన్నారు. లండన్‌లోని బ్రియాన్‌స్టన్‌ స్క్వేర్‌లో ఉన్న రూ.17కోట్ల విలువైన ఓ ప్రాపర్టీని రాబర్ట్‌ వాద్రా కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో వాద్రా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదయ్యింది. దీనిపై ట్రయల్‌ కోర్టు గతంలో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని.. దర్యాప్తు సంస్థ పిలిచినప్పుడల్లా హాజరుకావాలని ఆదేశించింది. అయితే, వాద్రా బెయిల్‌ షరతులు పాటించడం లేదని ఈడీ హైకోర్టులో సవాలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ సుధీర్‌ కుమార్‌ జైన్‌.. దర్యాప్తు సంస్థకు రెండు వారాల సమయం ఇస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)