నేరస్తులకు హారతి పట్టాలా ?

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లో భారీ ఎత్తున ఎన్ కౌంటర్లతో నేరస్తులను బెంబేలెత్తిస్తున్న యోగీ ఆదిత్యనాథ్.. పలు సందర్భాల్లో వారి ఇళ్లను కూడా బుల్ డోజర్లను పంపి కూల్చేస్తున్నారు. ఈ చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో యోగీ తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు. నేరస్తుల ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చివేయడాన్ని సమర్ధించుకున్నారు. అభివృద్ధి పథంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బుల్‌డోజర్‌లు, ఆధునిక యంత్రాలు అవసరమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లాంటి భారీ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే నేటి కాలంలో గడ్డపారలు కావాలా, ఇంతకుముందు ఏదైనా పని ఆమోదం పొందితే మాఫియా వచ్చి అక్రమ ఆస్తులు లాక్కునేది.. గత ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయలేదన్నారు. తమ ప్రభుత్వం బుల్‌డోజర్‌లతో నేరస్తుల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోందని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి బదులిస్తూ.. 'అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను లాక్కున్న వారికి నేను హారతి ఇవ్వాలా అని ప్రశ్నించారు. నేరస్తులు, మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం కేవలం మైనారిటీ వర్గాలకు చెందిన నేరస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోందన్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. యూపీలో ఓ అమాయక ముస్లిం వచ్చి తనకు అన్యాయం జరుగుతోందని చెప్పమనండి అని యోగీ ఆదిత్యనాథ్ సవాల్ విసిరారు. అలాగే అన్నింటికంటే ఎక్కువగా వారందరికీ కోర్టు ఉందన్నారు. మతంతో సంబంధం లేకుండా చట్టబద్ధమైన పాలన అందరికీ సమానమని, రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించాలని ఆదిత్యనాథ్ అన్నారు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)