రాహుల్ ద్రవిడ్‌తో బీసీసీఐ సెక్రటరీ జై షా భేటీ !

Telugu Lo Computer
0


సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ జరుగున్న నేపథ్యంలో ప్రపంచ కప్‌ జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టింది. స్పెయిన్‌లోని మియామిలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ తో బీసీసీఐ సెక్రటరీ జై షా ఇటీవల సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించారు. ఆసియా కప్, స్వదేశంలో ప్రపంచ కప్‌ లో అనుసరించాల్సిన ప్రణాళికలపై మాట్లాడినట్టు సమాచారం. ఈక్రమంలో కోచింగ్ సిబ్బంది పెంపు, రెండు ఫార్మాట్లకు ప్రత్యేక కోచ్‌ల నియామకం గురించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో అదరగొట్టిన టీమిండియా టెస్టు, వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. టీ20లో మాత్రం 2-3తో సిరీస్ కోల్పోయింది. దాంతో టీ20 జట్టకు ప్రత్యేక కోచ్ ఉండాలని మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్, మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్‌లు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆగస్టు 24 నుంచి బెంగళూరులోని అలూర్ స్టేడియంలో ఆసియా కప్ సన్నద్ధత క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్‌లో రాణించిన వాళ్లకు 15మంది బృందంలో చోటు దక్కే అవకాశం ఉంది. అక్టోబర్ 5న భారత గడ్డపై వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)