జమ్మూకాశ్మీర్‌ యువతకు పాక్‌ డ్రగ్స్‌ పంపిస్తోంది !

Telugu Lo Computer
0


మ్మూకాశ్మీర్‌ యువతకు పాకిస్థాన్‌ డ్రగ్స్‌ను బహుమతిగా పంపిస్తోందని డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌  వ్యాఖ్యానించారు. గతంలో పంజాబ్‌కు డ్రగ్స్ సరఫరా అయినట్లే.. ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు డ్రగ్స్‌ అందుతున్నాయని ఆయన వెల్లడించారు. 'ఈ కుట్ర పాకిస్థాన్‌ నుంచే జరుగుతోంది. పంజాబ్‌లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిన తరువాత పాకిస్థాన్‌ డ్రగ్స్‌ ప్రవేశపెట్టింది. పోలీసులు ఇక్కడ ఉగ్రదాడులను సమర్థవంతంగా అడ్డుకుంటున్నారు. అందుకే జమ్మూకశ్మీర్‌ యువతకు పాకిస్థాన్‌ డ్రగ్స్‌ బహుమతులను పంపుతోంది. అప్రమత్తంగా వ్యవహరించి ఈ కుట్రను ఓడించాలని' సింగ్‌ పేర్కొన్నారు. నార్కో-టెర్రరిజం వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని డీజీపీ తెలిపారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రోపిక్‌ పదార్థాల చట్టం ప్రకారం సుమారు 2వేల కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో 3వేల మందికి ప్రమేయమున్నట్లు వెల్లడించారు. పాకిస్థాన్‌ కేంద్రంగా రాష్ట్రంలో నడుస్తున్న నార్కో-టెర్రర్‌, ఆయుధ వ్యాపారాన్ని ఉక్కుపాదంతో అణచివేశామని పేర్కొన్నారు. ఎన్డీపీఎస్‌ చట్టం, పబ్లిక్‌ సేఫ్టీ చట్టం కింద అత్యధిక కేసులు నమోదైనట్లు డీజీపీ వెల్లడించారు. నార్కో-టెర్రర్‌ వ్యాపారం ద్వారా ఆస్తులు సమకూర్చుకున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నామన్నారు. మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ యువతకు పునరావాసం కల్పించేందుకు సివిల్‌ అధికారులతో కలిసి పోలీసులు పనిచేస్తున్నారని వివరించారు. ప్రాణాంతకమైన, సమాజానికి హానికరమైన డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)