చెస్‌లో 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర ?

Telugu Lo Computer
0


భారత చెస్‌లో కొత్త ఆధిపత్యం మొదలైంది. ఇన్నాళ్లు చెస్‌ పేరు చెబితే ముక్తకంఠంగా వినిపించే పేరు విశ్వనాథన్‌ ఆనంద్‌. దాదాపు 36 ఏళ్ల పాటు ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనందే. కానీ అతని ఆధిపత్యానికి 17 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ డీ గుకేష్ చెక్ పెట్టాడు. తన గురువును మించిపోయిన గుకేష్‌ ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి భారత చెస్‌ చరిత్రలో 'నయా కింగ్‌'గా అవతరించాడు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో తొలిసారి ఒక ఇండియన్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్‌ను మించి రేటింగ్ సాధించాడు.వరల్డ్ కప్ లో భాగంగా తన రెండో రౌండ్ మ్యాచ్ లో అజర్‌బైజాన్ కు చెందిన మిస్రట్దిన్ ఇస్కాందరోవ్ పై విజయం సాధించాడు. 44 ఎత్తుల్లో గుకేష్ గెలవడంతో అతనికి 2.5 రేటింగ్ పాయింట్లు వచ్చాయి. దీంతో గుకేష్ లైవ్ రేటింగ్ 2755.9కి చేరింది. మరోవైపు ఆనంద్ 2754.0 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. వరల్డ్ లైవ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం గుకేస్ 9వ స్థానంలో ఉండగా.. ఆనంద్ 10వ స్థానానికి పడిపోయాడు. అధికారిక ఫిడే రేటింగ్ లిస్టు ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నా.. గుకేష్ తన ఆధిపత్యం కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఫిడే ట్వీట్ చేసింది. "గుకేష్ ఇవాళ మళ్లీ గెలిచాడు. దీంతో లైవ్ రేటింగ్ లో విశ్వనాథన్ ఆనంద్ ను మించిపోయాడు. తర్వాతి ఫిడే రేటింగ్ లిస్ట్ అధికారికంగా ప్రకటించడానికి (సెప్టెంబర్ 1న) సుమారు నెల రోజుల సమయం ఉన్నా గుకేష్ టాప్ 10లో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలుస్తాడు" అని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ట్వీట్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)