మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 30 మంది అదృశ్యమైనట్లు తెలుస్తోంది. మూడు నెలల కాలంలో వీరంతా అదృశ్యమయ్యారు. వారిలో టీనేజర్ల నుంచి నడి వయసు వరకు ఉన్నారని మీడియా కథనాలు వెల్లడించాయి. 47 ఏళ్ల సమరేంద్ర సింగ్ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త. ఉద్రిక్తతలు మొదలైన కొద్దిరోజులకే అదృశ్యమయ్యాడు. ఇంతవరకూ అతడి జాడలేదని సింగ్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగ్ స్నేహితుడి జాడ కూడా లేదని తెలుస్తోంది. కాంగ్‌పోక్పీ ప్రాంతం వైపు వారు వెళ్లారని గుర్తించారు. తర్వాత నుంచి వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. జులై ఆరున ఆంక్షలు సడలించడంతో 17 ఏళ్ల హిజామ్ లువాంగ్బీ నీట్ కోచింగ్ నిమిత్తం ఇంటి నుంచి వెళ్లింది. పరిస్థితులు సద్దుమణిగాయని భావించిన ఆమె.. తర్వాత తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి వారి జాడలేకుండా పోయింది. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. వారు ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాలను బట్టి పోలీసులు వెల్లడించారు. వారిద్దరి ఫోన్లు రెండు వేర్వేరు జిల్లాల్లో స్విచ్ఛాఫ్ అయ్యాయని తెలిపారు. మూడు నెలల వ్యవధిలో అదృశ్యమైన వారి వెనక ఒక్కో కారణం ఉంది. ఫిర్యాదులు అందిన వెంటనే తాము చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. కానీ కనిపించకుండా పోయిన వారి జాడ మాత్రం దొరకడం లేదు. అదృశ్యమైన వారి సంఖ్య 30 మందిగా ఉన్నప్పటికీ.. ఇది మరింత పెరగొచ్చని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. https://t.me/offerbazaramzon
మణిపూర్ లో ఇప్పటివరకు 30 మంది అదృశ్యం !
August 02, 2023
0
Tags