ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇసుల్‌నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పోలీసు బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు మావోయిస్టుల క్యాంపు లక్ష్యంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల క్యాంపును పోలీసులు ధ్వంసం చేశారు. నలుగురు మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ ఏరియాలో మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)