అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

Telugu Lo Computer
0


అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున పోర్ట్‌బ్లెయిర్‌కి సమీపంలో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.9గా నమోదైంది. పోర్ట్‌బ్లెయిర్‌కు ఈశాన్యంగా 126 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. సముద్ర ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.53 నిమిషాలకు భూకంపం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. అండమాన్‌తో పాటు 5.9 తీవ్రతతో ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్దా భూమి ప్రకంపించినట్లు సమాచారం. భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, దీనికి సమాంతరంగా పాకిస్థాన్‌లోనూ ఈ ఉదయం భూకంపం వచ్చినట్టు ఎన్‌సీఎస్‌ పేర్కొంది. ఇది రిక్టర్‌ స్కేల్‌పై 4.0గా నమోదయినట్టు వివరించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)