ఓటీటీలకు స్వీయ నియంత్రణ అవసరం !

Telugu Lo Computer
0


సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు కొన్ని సవరణలు చేస్తూ అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఈ బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయి అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది. ఈ బిల్ లో పలు అంశాలు ఉండగా ముఖ్యంగా పైరసీ, సెన్సార్ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ బిల్ ప్రవేశపెడుతున్న సమయంలోనే పలువురు ఎంపీలు ఓటీటీలో వస్తున్న బోల్డ్, వల్గర్ కంటెంట్ గురించి కూడా కేంద్రమంత్రిని ప్రశ్నించారు. కరోనా తర్వాత ఓటీటీకి బాగా డిమాండ్ పెరగడంతో అన్ని ఓటీటీ సంస్థలు ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు తెస్తుంది. ఈ నేపథ్యంలో బోల్డ్, వల్గర్ కంటెంట్ ని కూడా పెంచేస్తున్నారు ఓటీటీ సంస్థలు. సినిమా, సిరీస్ కథల్లో అవసరం లేకపోయినా ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి బూతులు, శృంగార సన్నివేశాలు.. లాంటి వల్గర్ కంటెంట్ ని పెడుతున్నారు. దీనిపై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అనేకమంది ప్రముఖులు, ప్రేక్షకులు ఓటీటీకి సెన్సార్ లేకపోవడం వల్లే ఇష్టమొచ్చిన కంటెంట్ టెలికాస్ట్ చేస్తున్నారని, ఓటీటీకి సెన్సార్ తీసుకురావాలని కోరుతున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టడంతో పలువురు ఎంపీలు ఓటీటీకి సెన్సార్ గురించి కూడా అడిగారు. దీనికి కేంద్రమంత్రి సమాధానమిస్తూ.. ఇటీవల ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఓటీటీలో కూడా ఎన్నో మంచి కంటెంట్స్ వస్తున్నాయి. కొంతమంది మాత్రమే అలాంటి కంటెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే ఓటీటీ సంస్థలతో సమావేశం జరిగింది. ఓటీటీలకు స్వీయ నియంత్రణ అవసరం. ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్పాను. ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణలో ఉండి కంటెంట్ ని కంట్రోల్ గా టెలీకాస్ట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అవసరమైతే సెన్సార్ కూడా తీసుకురావాల్సి వస్తుందని ఓటీటీ సంస్థలకు చెప్పినట్లు తెలిపారు. https://t.me/offerbazaramzon



Post a Comment

0Comments

Post a Comment (0)