ఉత్తరప్రదేశ్‌ ఎమ్మెల్యే వినూత్ననిరసన

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లో కాన్పూర్‌లోని రోడ్లు  చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జూన్‌ 22న నీట మునిగిన అండర్‌ పాస్‌ వంతెన కింద నుంచి బైక్‌పై వెళ్తున్న డెలివరీ వ్యక్తి చరణ్‌ సింగ్‌ అక్కడి నీటిలో మునిగిపోయాడు. ఆ తర్వాత రోజు అతడి మృతదేహంతోపాటు బైక్‌ను వెలికితీశారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ఆర్యానగర్‌ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్‌పాయ్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఎస్‌యూవీపై ఉన్న బోటులో తెడ్డుపట్టుకుని కూర్చొన్నారు. కారుపై అలా ప్రయాణించి జనాన్ని ఆకట్టుకున్నారు. జలమయమైన కాన్పూర్‌ రోడ్ల సమస్యను అధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే నీటితో నిండిన రోడ్లపై వెళ్లేందుకు బోట్లు, సెఫ్టీ జాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం, కాన్పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతిపై మండిపడ్డారు. మరోవైపు కారుపై బోటు ఉంచి అందులో ప్రయాణించి వినూత్నంగా నిరసన తెలిపిన ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్‌పాయ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో కాన్పూర్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీసులు స్పందించారు. ఆ ఎమ్మెల్యే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపించారు. రూ.2,000 చలానా కూడా విధించారు. అయితే ట్రాఫిక్‌ పోలీసులు విధించిన చలానా రుసుమును శనివారం చెల్లించినట్లు ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్‌పాయ్‌ తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)