తమిళనాడులోని కోయంబత్తూరు సర్కిల్ డీఐజీ హోదాలో పనిచేస్తున్న సి.విజరు కుమార్ శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని డిఐజి ఆత్మహత్య చేసుకున్నారు. రెడ్‌ఫీల్డ్స్‌లోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో తన నివాసంలో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. తీవ్ర ఒత్తిడే ఆయన మరణానికి కారణమని తెలుస్తోంది. పోస్ట్‌మార్టం నిమిత్తం కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు మృతదేహాన్ని తరలించారు. ఈ ఏడాది జనవరి నుంచి విజరు కుమార్ డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు. https://t.me/offerbazaramzon
తమిళనాడు డీఐజీ ఆత్మహత్య
July 07, 2023
0
Tags