మధ్యప్రదేశ్ కునో జాతీయ పార్కు లోని చీతాలకు రేడియో కాలర్లు తొలగించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ఆరోగ్య పరీక్షల కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 'ప్రాజెక్టు చీతా'లో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి రెండు విడతల్లో 20 చీతాలను తీసుకురాగా.. ఇప్పటి వరకు 8 మృతి చెందిన విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితులు తట్టుకోలేకే అవి మృత్యువాత పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. వాటికి అమర్చిన రేడియో కాలర్ వల్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆరు చీతాల రేడియో కాలర్లను తొలగించారు. 'ప్రస్తుతం ఆరు మగ, ఐదు ఆడ చీతాలు ఎన్‌క్లోజర్లలో ఉన్నాయి. పూర్తిస్థాయి వైద్య పరీక్షల నిమిత్తం వాటిలో ఆరింటి రేడియో కాలర్లను తొలగించాం. ఈ చీతాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి' అని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. చీతాల కదలికలను పసిగట్టేందుకు వీలుగా వాటి మెడకు రేడియో కాలర్లను అమర్చారు. అయితే, వాటి వల్ల చీతాలకు గాయాలైనట్లు అధికారులు గుర్తించారు. ఆ క్రమంలోనే అన్ని చీతాలను తిరిగి ఎన్‌క్లోజర్లలోకి చేర్చారు. వాటికి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి విడిచిపెట్టనున్నారు. ఇకపై వాటి కదలికలను పసిగట్టేందుకు రేడియో కాలర్ బదులు డ్రోన్‌లను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. https://t.me/offerbazaramzon
చీతాలకు రేడియో కాలర్లు తొలగింపు !
July 24, 2023
0
Tags