ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థుల ఘరానా మోసం

Telugu Lo Computer
0


వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్షలో ఘరానా మోసాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మోసాన్ని బట్టబయలు పోలీసులు చేశారు. రూ.7లక్షలు ఇస్తే నీట్ పరీక్ష రాస్తాం అంటూ ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్ధులు చేసే ఘరానా మోసం బయటపడింది. నీట్ ఎగ్జామ్ రాయిస్తాం అంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7లక్షలు వసూళ్లు చేసి వారి స్థానంలో నకిలీ అభ్యర్ధులతో ఓ ముఠా పరీక్ష రాస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేశ్ బిష్రోయ్ ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నట్లుగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు.  ఢిల్లీ వేదికగా నడుతున్న 'నీట్‌ రాకెట్‌'ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ ముఠా నాయకుడు నరేష్ బిష్రోయ్ తో సహా నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. నీట్‌ పరీక్షలో అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేయించి వారితో నరేశ్ పరీక్ష రాయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏ మోసానికైనా డబ్బులే ప్రధానంగా ఉంటాయి. అదే డబ్బు ఆశ పెట్టి కొంతమందిని నరేశ్ ఆకట్టుకున్నాడు. అలా కొంతమందిని తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు దీంట్లో భాగంగా ఎయిమ్స్‌లో ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్ధులతో నీట్ పరీక్ష రాయించేవాడు. దీని కోసం వారితో స్నేహం చేసిన నెమ్మదిగా వారికి డబ్బు ఆశపెట్టి రంగంలోకి దింపుతాడు. తాను కూడా అలాగే వేరే అభ్యర్థి స్థానంలో పరీక్ష రాస్తుంటాడు. అలా తను రెండో సంవత్సరం పరీక్ష రాస్తూ దొరికిపోయాడు. 

దీంట్లో భాగంగానే ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ ప్రవేశ పరీక్షలో నరేశ్ గ్యాంగ్‌కు చెందిన కొంతమంది అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిమ్స్‌లో రేడియాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న  సంజూ యాదవ్ అనే విద్యార్ధి వేరే (డీల్ కుదుర్చుకున్న అభ్యర్థి) స్థానంలో పరీక్ష రాస్తు అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఢిల్లీలోనే కాకుండా మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఓ నీట్‌ పరీక్షా కేంద్రంలో మరో ఇద్దరు విద్యార్థులు మహవీర్‌, జితేంద్ర  అనే ఇద్దరు విద్యార్ధులు పట్టుబడ్డారు. వీరిద్దరు కూడా ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్ధులే. వారిని విచారించగా కీలక విషయాలు బయటపడ్డాయి. నకిలీ విద్యార్థులతో పరీక్ష రాయించేందుకు నీట్ పరీక్ష రాయించటానికి ఒక్కో అభ్యర్థి నుంచి నరేశ్ రూ.7లక్షలకు డీల్ మాట్లాడుకుంటాడు. దాని కోసం ముందుగా లక్ష రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుంటాడు. పరీక్ష రాసిన తరువాత మిగిలిన ఆరు లక్షల రూపాయలు తీసుకుంటాడు. అలా పరీక్ష రాసిన అభ్యర్థికి (ఫేక్ అభ్యర్థి)కి కొంత ఇస్తాడు. ఇలా మోసం ఎల్లకాలం సాగదన్నట్లుగా ఈ ఫేక్ అభ్యర్థులు (Fake candidates)అడ్డంగా దొరికిపోయారు. వీరిని విచారించగా పలు అంశాలు వెలుగులోకి రావటమే కాకుండా ఇంకా ఈ ముఠాతో ఎవరెవరికి లింకులు ఉన్నాయో దర్యాప్తు ముమ్మరం చేశారు ఢిల్లీ పోలీసులు. నిందితుల నుంచి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)