ఢిల్లీ వరద నీళ్లలో సరదాగా ఈత కొట్టేందుకు యత్నించిన ముగ్గురు పిల్లలు.. అందులోనే మునిగిపోయారు. ఓ కానిస్టేబుల్ నీళ్లలో దూకి వారిని కాపాడేందుకు యత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. మృతులంతా 12- 15 ఏళ్లలోపు వారేనని, జహాంగీర్‌పురివాసులని పోలీసులు తెలిపారు. దిల్లీలోని ముకుంద్‌పుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. దిల్లీలో తాజా వరదలకు సంబంధించి నమోదైన మొదటి మరణాలు ఇవేనని అధికారులు తెలిపారు. మరోవైపు పైనుంచి వస్తోన్న వరదతో కొన్ని రోజులుగా ఉప్పొంగుతోన్న యమునా నదిలో ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి 208.20 మీటర్ల వద్ద ఉంది. ఈ ఉదయం 6 గంటల సమయంలో నీటి మట్టం 208.46 మీటర్లుగా నమోదైంది. ఉదయంతో పోలిస్తే కాస్త తగ్గినా.. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే మూడు మీటర్లు ఎక్కువగానే ఉంది. మరోవైపు.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాలు దిల్లీలో యమునా నది తీరంలోని ఐటీఓ ప్రాంతంలో పర్యటించి.. వరద పరిస్థితులను సమీక్షించారు. దిల్లీలో వరదల ప్రభావం కొనసాగుతుండటంతో విద్యాసంస్థలను జులై 16 వరకు మూసివేశారు. శుక్రవారం స్థానికంగా తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పిన వాతావారణ శాఖ.. శనివారానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. https://t.me/offerbazaramzon
వరద నీళ్లలో ఈతకు దిగి ముగ్గురు బాలురు మృతి
July 14, 2023
0
Tags