మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌

Telugu Lo Computer
0


హారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కార్‌కు అజిత్‌ పవార్‌ మద్దతు ప్రకటించారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న అజిత్‌పవార్‌ గవర్నర్‌కు మద్దతు లేఖ ఇచ్చారు. షిండే కేబినెట్‌లో చేరిన అజిత్‌పవార్‌కు  అందరూ ఊహించినట్లుగానే ఉప ముఖ్యమంత్రి  పదవి ఇచ్చారు. కాసేపటి క్రితమే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ గ్రూప్ లో మరో 9 మంత్రికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఇదిలా ఉంటే ఎన్సీపీలో కొద్దిరోజుల క్రితమే నాయకత్వ మార్పు జరిగిన విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలేతో పాటు ప్రఫుల్‌ పటేన్‌ను నియమించారు. దీంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న అజిత్‌పవార్‌ తిరుగుబాటుకు తెర తీశారు. ఈక్రమంలోనే అజిత్‌పవార్‌తో పాటు సీఎం షిండే , డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ కూడా రాజ్‌భవన్‌ చేరుకున్నారు. 30 మంది ఎమ్మెల్యేలతో అజిత్‌పవార్‌ సమావేశం జరిపిన విషయం తనకు తెలియదని శరద్‌ పవార్‌ చెప్పుకొచ్చారు. https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)