యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చడం ఆందోళనకు గురి చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టగా, బుధవారం ఉదయానికి నీటి మట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగుతోందని అధికారులు తెలిపారు. కేంద్ర జలకమిషన్ సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) దాటి 205.48 మీటర్లుగా నమోదైంది. ఈ సాయంత్రానికి ఇది 205.72 మీటర్లను చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం యమునా నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరి 208.66 మీటర్లుగా నమోదవ్వడంతో ఢిల్లీ లోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. https://t.me/offerbazaramzon
యమునా నది మళ్లీ ఉగ్రరూపం !
July 19, 2023
0
Tags