కర్ణాటకలోని ఉడుపి టౌన్ లో ఉన్న మహిళా నర్సింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థినులు మరో అమ్మాయి నగ్న వీడియో చిత్రీకరించారు. నర్సింగ్ కాలేజీలో చదువుకుంటున్న ఓ అమ్మాయి బాత్రూమ్ లో ఉండగా మరో ముగ్గురు అమ్మాయిలు సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేశారు. ఇది జరిగి వారం రోజులు అవుతున్నా కూడా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉడుపి వాసి, సోషల్ యాక్టివిస్ట్ రష్మీ సమంత్ ట్వీట్ చేశారు. మరో వర్గానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఈ వీడియో తీశారని రష్మీ సమంత్ ట్వీట్ చేశారు. దీంతో ఈ పోస్టు సంచలనంగా మారింది. విషయం పెద్దదవ్వడంతో ముగ్గురు విద్యార్థినులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేశారు. వీళ్లంతా నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఈ ఘటన జూలై 19న ఉడుపిలో ఉన్న ప్రైవేట్ కంటి ఆసుపత్రి మరియు నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అంటూ ప్రచారం చేస్తున్నారని రష్మీ సమంత్ మండిపడ్డారు. విద్యార్థిని బాత్రూమ్ లో ఉండగా సీక్రెట్ గా మొబైల్ తో వీడియో తీసిన మాట నిజమేనని నేత్రజ్యోతి నర్సింగ్ కళాశాల డైరెక్టర్ రష్మీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారి నుంచి మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. https://t.me/offerbazaramzon
నర్సింగ్ విద్యార్థిని బాత్రూమ్‌లో ఉండగా వీడియో తీసిన విద్యార్థినులు !
July 26, 2023
0
Tags