ఎన్సీపీ చీలిక వెనుక శరద్ పవార్ హస్తం !

Telugu Lo Computer
0


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌పై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్‌) అధినేత రాజ్‌ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌.. శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరడం వెనక శరద్ పవార్ హస్తం ఉందని రాజ్‌ఠాక్రే చెప్పారు. మూడు రోజుల క్రితం ఎన్సీపీలో చీలికపై రాజ్‌ఠాక్రే మీడియాతో మాట్లాడారు. అజిత్ పవార్‌తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారని, ఇది చాలా అసహ్యంగా ఉందlని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ఓటర్లను అవమానించడమేనని స్పష్టం చేశారు. అజిత్ పవార్‌తోపాటు ప్రఫుల్ పటేల్‌, దిలీప్ వాల్సే, పాటిల్‌, చగన్ భుజ్‌భల్ వంటి సీనియర్ నేతలు శరద్ పవార్ ఆశీస్సుల్లేకుండా ముందుకెళ్లరని అన్నారు. `మహారాష్ట్రలో ఇటువంటి పద్దతులకు శ్రీకారం చుట్టిందే శరద్ పవార్‌. 1978లో నాటి వసంతదాదా పాటిల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పవార్ చీల్చారు. పురోగామి లోక్‌సాహి దల్ (పులోద్‌) ప్రభుత్వానికి తొలిసారి శరద్ పవార్ మద్దతు తెలిపారు. అంతకుముందు ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. పవార్‌తో మొదలైన ఈ కార్యక్రమాలు పవార్‌తోనే ముగిశాయి` అని రాజ్‌ఠాక్రే వ్యాఖ్యానించారు.         https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)