బైక్‌పై స్టంట్స్ చేసి సస్పెండైన పోలీస్‌ !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ బైక్‌పై స్టంట్స్‌  చేశాడు. అంతేగాక వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది పోలీస్‌ అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్‌ను సస్పెండ్‌ చేశారు. పోలీస్‌ యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ సందీప్ కుమార్ చౌబే, రేసింగ్ బైక్‌పై విన్యాసాలు చేశాడు. అంతేగాక ఒక వీడియో క్లిప్‌ను రికార్డ్‌ చేశాడు. 'నీకు శత్రువులంటే భయం లేదా?' అని ఒక అమ్మాయి అడుగుతుంది. దీనికి అతడు బదులిస్తాడు. 'శత్రువులంటే భయం ఎందుకు? చావు అంటే ఏమిటి? ఈరోజు కాకపోతే రేపైనా మనం చనిపోతాం. భయపడాలంటే దేవుడికి భయపడండి. కీటకాలు, స్పైడర్లకు ఎందుకు భయపడతారు?' అని ప్రశ్నిస్తాడు. ఈ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాగా, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయవద్దంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన కానిస్టేబుల్ సందీప్ కుమార్ చౌబేపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అతడ్ని సస్పెండ్‌ చేశారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)