సైకిల్‌పై వచ్చిన వారికి కిలో టమోటాల బహుమతి

Telugu Lo Computer
0


మిళనాడులోని తంజావూరు మేరీస్‌ కార్నర్‌లో ఓ ప్రైవేటు ట్రస్ట్‌, ట్రాఫిక్‌ విభాగం సంయుక్తంగా ద్విచక్రవాహనాలతో ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించేలా సైకిల్‌ వినియోగించాలని కోరుతూ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్‌ విభాగం కమిషనర్‌ ఎంజీ రామచంద్రన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సైకిళ్లపై వచ్చిన 50 మందిని అభినందిస్తూ, ఒక్కొక్కరికి కిలో టమోటాలు బహుమతిగా అందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్‌ రామచంద్రన్‌ తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)