మూడు వేల కేజీల టమాటాలు ఎగబడి కొన్నారు !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్, కాన్పూర్ లోని నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్) మొబైల్ వ్యాన్‌ల ద్వారా కిలో టమాటా రూ. 80కే విక్రయించింది. దీంతో ప్రజలు కొన్ని గంటల్లోనే ఎగబడి మరీ వాటిని కొనేశారు. 3 గంటల్లో ఏకంగా 3000 కిలోలు అమ్ముడవ్వడం గమనార్హం. టమాటాలు కొనలేక అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం ఎన్‌సిసిఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. గరిష్టంగా ఒక్కొక్కరికి 2 కిలోలు విక్రయించినట్లు ఎన్‌సిసిఎఫ్ బ్రాంచ్ సౌమ్య బిష్త్ వెల్లడించారు. నగరవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈ విక్రయాలు సాగించినట్లు ఆమె తెలిపారు. ఈ టమోటా కర్ణాటక నుండి కొనుగోలు చేసినట్లు ఆమె వెల్లడించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)