మంచి నీళ్లనుకుని యాసిడ్‌ తాగిన మహిళ !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో బాటిల్స్‌ను శుభ్రం చేసే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు మంచినీళ్లు అనుకుని యాసిడ్‌ తాగడంతో పరిస్థితి విషమంగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. రింకూ ఠాక్రే అనే మహిళ బాటిల్స్‌ను శుభ్రం చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. దాహం వేయడంతో తన పక్కనే ఉన్న మరో మహిళను మంచినీళ్లు అడిగింది. పనిలో ఉన్న ఆ మహిళ గమనించకుండా నీళ్ల సీసాను అందించింది. రింకూ కూడా మంచినీళ్లు అనుకోని పొరపాటున తాగింది. నోరు కాలడంతో వెంటనే ఉమ్మడానికి ప్రయత్నించిన యాసిడ్‌ లోపలకు వెళ్లడంతో ఆమె అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు' అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)