మధ్యప్రదేశ్ లోని షాహ్‌డోల్‌లో బీజేపీ నిర్వహించిన సభలో మోడీ పాల్గొని మాట్లాడుతూ ”కొందరు తప్పుడు హామీలు ఇస్తున్నారు. వారికే భరోసా లేదు కానీ, ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అటువంటి హామీలు ఇచ్చే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. కొత్త పథకాలతో ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు గిరిజనులకు పట్టించుకోలేదు. మేము గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి, ప్రత్యేకంగా గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం ” అని మోడీ అన్నారు. గిరిజన మహిళను తాము దేశ రాష్ట్రపతిని చేయాలనుకుంటున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ప్రవర్తించాయో అందరూ చూశారని అన్నారు. ”ప్రతిపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల్లో చేయిస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ పార్టీలన్నీ కలవాలనుకుంటున్నాయి. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడానికే ఆ పార్టీలన్నీ కలుస్తున్నాయి ” అని మోడీ అన్నారు. కాగా, ఇప్పటికే బీహార్ రాజధాని పాట్నలో సమావేశం నిర్వహించిన ప్రతిపక్ష పార్టీలు త్వరలో బెంగళూరులో మరోసారి భేటీ కానున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఐక్యంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు రచించాలని భావిస్తున్నాయి. https://t.me/offerbazaramzon
వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడానికి ఈ పార్టీలన్నీ కలుస్తున్నాయి !
July 01, 2023
0
Tags