వరద ఉద్ధృతిలో చిక్కుకున్న ప్రయాణికుల బస్సు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌ లోని కొత్వాలీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో యూపీ-ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లోని ఓ రోడ్డుపైకి భారీగా వరదనీరు వచ్చింది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు వరదల్లో చిక్కుకుపోయింది.  యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు రూపెదిహా నుంచి హరిద్వార్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో బస్సు ముందుకెళ్లలేకపోయింది. తమను కాపాడాలంటూ ప్రయాణికులు హహకారాలు చేశారు. బస్సును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు జేసీబీ మిషన్ల సాయంతో ప్రయాణికులను రక్షించారు. ఆ తర్వాత బస్సును కూడా వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)