మధ్యప్రదేశ్ రత్లాము, ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ కథనం ప్రకారం..రాజ్ కుమార్ రైల్వేలో టీఎన్సీ చీఫ్‌గా పని చేసి పదవీ విరమణపొందాడు. ఇంట్లో ఉంటున్న సమయంలో మద్యం సేవిస్తూ, భార్యతో గొడపడుతూ ఉండేవాడు. గత నెల 30న సాయంత్రం 5 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజ్ కుమార్ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. గుట్కా తినేందుకు భార్యను డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురై వెంటనే వంటగదిలో ఉన్న కూరగాయల కత్తిని తీసుకుని భార్య ఛాతిపై పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో పొరిగింటి వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుడి కుమారుడు కమలేష్ మాంజీ ఫిర్యాదు మేరకు నిందితుడైన రాజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆమెను హత్య చేసినందుకు అతడు పాశ్చాత్తాప పడటం లేదని పోలీసులు చెబుతున్నారు. https://t.me/offerbazaramzon
గుట్కాకు డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్య చేశాడు !
July 01, 2023
0
Tags