డాక్టర్ మానవ్ అరోరా ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన కన్సల్టేషన్ ఫీజు 500 రూపాయలు. ఇటీవల ఆయన దగ్గరికి వచ్చిన ఓ రోగి కన్సల్టేషన్ ఫీజు కింద రూ.500 నోటు ఇచ్చాడు. అందరూ ఇచ్చేట్టుగానే ఇచ్చాడు కదా అని తీసుకున్న రిసెప్షనిస్ట్ నోటును పరిశీలించకుండానే లోపల పెట్టేసింది. ఆ రోగి డాక్టర్ ను కలిసి, మందులు రాయించుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం డబ్బుల లెక్కలు చూస్తుండగా నకిలీ 500 నోటును గుర్తించారు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఫొటోతో సహా సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. అయితే, అది నకిలీ నోటు అని ఆ పేషెంట్ కు కూడా తెలిసి ఉండదని, వేరెవరో ఇచ్చిన నోటును తనకు ఇచ్చి ఉంటాడని డాక్టర్ మానవ్ అరోరా తన పోస్టులో చెప్పుకొచ్చారు. విషయమేంటంటే ఆ నోటు మీద ఫర్ ప్రాజెట్స్ స్కూల్ యూస్ ఓన్లీ అని కూడా రాసి ఉంది. అయితే తాను మోసపోయినట్లు గుర్తించి బాగా నవ్వుకున్నట్లు డాక్టర్ మానవ్ చెప్పారు. ఆ నకిలీ నోటును తాను భద్రంగా దాచుకుంటానన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ డాక్టర్ మానవ్ అరోరా స్పోర్టివ్ స్పిరిట్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. https://t.me/offerbazaramzon
నకిలీ నోటు తో డాక్టర్ ను బురిడీ కొట్టించిన రోగి !
July 10, 2023
0
Tags