అధిష్ఠానం నిర్ణయం మేరకు ముందుకు సాగుతా !

Telugu Lo Computer
0


బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత బుధవారం కిషన్ రెడ్డి మొదటిసారి మీడియాతో మాట్లాడుతూ  అధిష్ఠానం నిర్ణయం మేరకు తాను ముందుకు సాగుతానని చెప్పారు. జూలై 8న వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోడీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రి పదవికి సంబంధించి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ రోజు ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. కేంద్రమంత్రిగా ఉంటూనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించడం ఇబ్బందికరమే. ఈ క్రమంలో ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్ ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)