పెరోల్ పై బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు !

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్‌లో వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఇద్దరు ఖైదీల మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారీ తీసింది. అబ్దుల్ హసీమ్(అస్సాం)కు 8 ఏళ్లు , షహనారా ఖతున్ (బెంగాల్) కు 6 ఏళ్లు జైలు శిక్ష పడటంతో వీరిద్దిరిని పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లో శిక్ష అనుభవిస్తు్న్నారు. అక్కడ వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారింది. ఆ తరువాత ఇద్దరు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఐదు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చి ముస్లిం చట్టం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తరువాత తిరిగి జైలుకు వెళ్లిపోయారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సాధారణ జీవితాన్ని గడపాలని అనుకుంటున్నామని వెల్లడించారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)