బ్రిడ్జి ని దొంగలు ఎత్తుకు పోయారు !

Telugu Lo Computer
0


ముంబైలోని మలాడ్ ప్రాంతంలో అదానీ ఎలక్ట్రిసిటీకి చెందిన ఓ భారీ బ్రిడ్జిని ఎత్తుకుపోయారు దొంగలు. ఇది కాస్తా అదానీ ఎలక్ట్రిసిటీ యాజమాన్యం దృష్టికి వెళ్లటంతో వారు షాక్ అయ్యారు. అదేదో నిర్మానుష్య ప్రాంతంలో ఉండేది కాదు ఎప్పుడూ రద్దీగా ఉండే మార్గంలో 90 అడుగుల పొడవున్న ఇనుప బ్రిడ్జీని ఎత్తుకుపోయారంటే వాళ్లు మామూలు దొంగలై ఉండరు. అదానీ కంపెనీకి చెందిన సంబంధిత వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. 

అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ 2022 జూన్‌ నెలలో మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ కాలువపై ఇనుప వంతెన్ని తాత్కాలికంగా నిర్మించింది. అదానీ సంస్థకు చెందిన భారీ ఎలక్ట్రిక్ వైర్లను తరలించేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో అదే కాలువపై మరో వంతెన నిర్మించారు. దీంతో కొత్త బ్రిడ్జీ అందుబాటులోకి రావటంతో అదానీ బ్రిడ్జీ నిర్మించిన ఆ ఇనుప వంతెన వినియోగించటం తగ్గిపోయింది. అలా క్రమేపీ ఆ వాడకం తగ్గిపోయింది. దీంతో దొంగల కన్ను ఆ బ్రిడ్జీపై పడింది.  ఈ వంతెనను ఎవరూ వినియోగించకపోవడంతో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అలా అక్కడ ఓ వంతెన ఉండేది కదా ఇప్పుడు కనిపించటంలేదేంటీ..అని కొంతమందికి అనుమానం వచ్చింది. అలా జూన్ 26న అక్కడ ఉండే వంతెన మాయం అయినట్లుగా స్థానికులు గుర్తించారు. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి బ్రిడ్జిని వంతెనను ముక్కలుగా చేసి తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురిలో ఒకరికి ఈ వంతెన ఏర్పాటుతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. సదరు నిందితు ఈ వంతెన నిర్మించినప్పుడు అదానీ సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసాడని అలా ఆనూపాను బాగా తెలిసి ఈ చోరీలో అతను భాగస్వామి అయ్యాడని పోలీసుల విచారణలో గుర్తించారు. మిగిలిన ముగ్గురు సదరు వ్యక్తి సహకరించి మరికొందరు సహాయంతో మాయం చేశారు. వీరితో పాటు ఈ చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే చోరీకి గురి అయిన ఇనుములో చాలా వరకు స్వాధీనం చేసుకున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)