నాకు ఎటువంటి మూఢ నమ్మకాలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వాతావరణంలో మార్పులతోనే అతివృష్టి, అనావృష్టి సమస్య తీవ్రమవుతున్నట్లు వివరించారు. హుబ్బళ్లి విమానాశ్రయంలో తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరవు వెంటాడుతుందంటూ భాజపా ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిందన్నారు. ఇప్పుడు విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వారు ఏమి బదులిస్తారని ప్రశ్నించారు. భాజపా అధికారంలో ఉన్నప్పుడు వరదల కారణంగా లక్ష ఇళ్లు కూలిపోయాయని, వారికి పరిహారాన్ని ఇవ్వడం కూడా సాధ్యపడలేదని తప్పుపట్టారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఆయా జిల్లాల వ్యవహారాల బాధ్యులు సందర్శిస్తున్నారని తెలిపారు. తాను కూడా ఉడుపి, మంగళూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. కొడగు జిల్లాకు మంత్రి కృష్ణ భైరేగౌడ వెళ్లారని చెప్పారు. https://t.me/offerbazaramzon
మూఢ నమ్మకాలు నాకు లేవు !
July 26, 2023
0
Tags