ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సుపై డాక్టర్ వేధింపులు !

Telugu Lo Computer
0


ర్ణాటకోని కొప్పల్ తాలూకాలోని హిరేసిందోగి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రమేష్ సీనియర్ వైద్యుడిగా పని చేస్తున్నాడు. ,అక్కడే స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తున్న వివాహిత మహిళను తనకు శారీరక సుఖం ఇవ్వాలని ఆ స్టాప్ నర్సును వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ రమేష్ వేధింపులు ఎక్కువ కావడంతో ఆ విషయాన్ని నర్సు ఆమె భర్తకు చెప్పింది. నర్సు భర్త వెళ్లి డాక్టర్ రమేష్ ను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన డాక్టర్ రమేష్ ఆ నర్సును మరింతగా వేధించడంతోపాటు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తానని, భార్యాభర్తలను విడదీస్తానని నర్సును బెదిరించాడు. అంతటితో ఆగని వైద్యుడు రమేష్ వేధింపులు ఎక్కువ అయ్యాయి. పలుకుబడి ఉపయోగించిన డాక్టర్ రమేష్ నర్సు సక్రమంగా ఉద్యోగానికి రావడంతో లేదని ఆమెకు గత రెండు నెలలుగా జీతం రాకుండా చేశాడు. దీంతో తన భార్యకు జీతం ఎందుకురాలేదని అడిగేందుకు నర్సు భర్త డాక్టర్ రమేష్ దగ్గరకు వెళ్లాడు. ఆ సందర్బంలో తన మీద దాడి చేసి తనను చంపడానికి నర్సు భర్త ప్రయత్నించాడని అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసి అతన్ని జైలుకు పంపించాడు. డాక్టర్ రమేష్ వేధింపులతో విసిగిపోయిన ఆ సాఫ్ట్ నర్సు అలవండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీని ప్రకారం పోలీసులు డాక్టర్ రమేష్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)