భోపాల్ నుంచి గ్వాలియర్‌కు వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణం చేసిన ఓ ప్రయాణీకుడికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అందించిన ఆహారంలో బొద్దింక కనిపించింది. దీనిపై అతను ఆందోళన వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో (@subodhpahalajan) పోస్టు పెట్టాడు. '@IRCTCofficial నా ఆహారంలో, వందే భారత్ రైలులో బొద్దింక కనిపించింది' అనే శీర్షికతో తను అందుకున్న ఆహారపు ఫోటోలను యాడ్ చేస్తూ షేర్ చేశాడు. ఫోటోలలో రోటీలలో ఒకదానికి చిన్న బొద్దింక అంటుకున్నట్లు కనిపించింది. ఈ పోస్టుపై చాలా మంది స్పందించారు. పోస్టు వైరల్ అవుతోంది. ఇదే మార్గంలో ప్రయాణించిన చాలామంది కలుషిత ఆహారం విక్రయిస్తున్నారని, ఆరోగ్యాలు పాడు చేస్తున్నారని కామెంట్లు చేశారు. ఇక ఈ పోస్టుపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్సత్వరమే స్పందించి, చర్య తీసుకుంది. ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఆహారాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి ఘటనలు జరిగితే సహించేది లేదని, కఠినమైన హెచ్చరికతో లైసెన్స్‌దారుపై చర్యలు తీసుకోబడ్డాయని' రిప్లై ఇచ్చింది. ఈ పోస్టు వైరల్ అవుతోంది. అనేకమంది తమ అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు. https://t.me/offerbazaramzon
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆహారంలో బొద్దింక !
July 27, 2023
0
Tags