మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు వేడుకలు చాలా కూల్‌గా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. రాంఛీలో తన నివాసంలో మూడు పెంపుడు కుక్కలతో కలిసి కేక్ కట్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అప్పుడెప్పుడో ఐదు నెలల క్రితం తన ఫామ్‌హౌజ్‌లో పొలం దున్నుతున్న వీడియోను షేర్ చేసిన ధోనీ, బర్త్ డే తర్వాతి రోజు తన కుక్కలతో సెలబ్రేషన్స్ జరుపుకున్న వీడియోను షేర్ చేసాడు. 'మీ అందరి విషెస్‌కి చాలా థ్యాంక్యూ.. నేను నా బర్త్ డే రోజున ఏం చేశానో చెప్పడానికి ఇది ఓ చిన్న టీజర్' అంటూ కాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన గంటలోనే 30 లక్షలకు పైగా లైకులు, వేలల్లో లైకులు వచ్చేశాయి. ధోనీ భార్య సాక్షి సింగ్, లవ్ సింబల్స్‌ని కామెంట్ చేయగా.. భువనేశ్వర్ కుమార్ భార్య నుపుర్ నగర్ 'ఈ రోజు ఇంటర్‌నెట్‌లో ఇదే క్యూటెస్ట్ వీడియో' అంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా కోలీవుడ్ హీరోయిన్లు ఐశ్వర్యా లక్ష్మీ, రమ్యా పాండియన్ కూడా ధోనీ వీడియోపై 'తలా' అంటూ లవ్ ఎమోజీలు కామెంట్లు చేశారు. https://t.me/offerbazaramzon
పెంపుడు కుక్కలతో కలిసి ధోనీ బర్త్ డే !
July 08, 2023
0
Tags