ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూ బట్టల షాపులో అమ్మకానికి పెట్టిన చీర మార్కెట్ ను షేక్ చేస్తోంది. శ్వేతవర్ణంలో అందంగా మెరిసిపోతున్న ఈ చీర షాపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చీరకు వినియోగించిన వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటివి చీరకు ఈ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. పైగా ఈ చీర తయారీకి రెండేళ్లు పట్టిందట !. యూపీలో చికన్ వర్క్ వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. మరి ముఖ్యంగా కాన్పూర్, లక్నోలలో ఈ చికన్ వర్క్ కు ప్రసిద్ది చెందాయి. ఇక్కడ అమ్మే ప్రతీ వస్త్రం దాదాపు చికన్ వర్క్ తో తయారు చేసినవే ఉంటాయి. అక్కడ మహిళలు ఈ చికన్ వర్క్ కుట్టటంలో చేయి తిరగిన నిపుణులుగా పేరొందారు. ఈ రాయల్ చీరలో కూడా చికన్ వర్క్ ను వినియోగించారు. పైగా ఈ చీరకు షిఫాన్, చికన్‌కారీ కుట్లు ప్రత్యేక ఆకర్షణ అని షాపు నిర్వాహకులు చెప్పారు. యూపీ రాజధాని లక్నోను ఒకప్పుడు నవాబుల నగరంగా పిలిచేవారు. అదే మాట ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే అత్యంత ఖరీదైన చీరలకు లక్నో సిటీ బాగా ఫేమస్. ఈ రూ.21 లక్షల ఖరీదైన ఈరాయల్ శారీ.. హజ్రత్‌గంజ్ లోని అడా ఫ్యాషన్ స్టోర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చీర ఖరీదు అక్షరాల 21లక్షల 9వేల రూపాయలు. హజ్రత్‌గంజ్‌లోని అడా డిజైనర్ చికాన్ స్టూడియో ఈ చీరను తయారు చేసారు. చికంకారీ ఫ్యాబ్రిక్ మిక్స్‌తో ఈ చీర తయారు చేశారు. అదే దీని ఖరీదు వెనుక ప్రత్యేకత. ఈ చీరలో స్ఫటికాలు ఉపయోగించబడ్డాయి. వాటి వల్లే ఈ చీరకు ప్రత్యేక మెరుపునిచ్చింది. దుబాయ్‌కి చెందిన ఓ మహిళ ఈ చీరను కొనుగోలు చేశారు. ఈ మెరుస్తున్న తెల్లటి రంగు చీరను లక్నో రాయల్ చీర అని పిలుస్తున్నారు. ఈ చీరలో జపాన్ కు చెందిన ముత్యాలను వినియోగించారు. షాప్ అడా ఫ్యాషన్ స్టోర్ యజమాని హైదర్ అలీఖాన్ ఈ చీర గురించి మాట్లాడుతూ ఇదే కాదు ఇలాంటి ఖరీదైన రాయల్ శారీ మరొకటి ఆర్డర్ వచ్చిందని దాన్ని అక్టోబరు నాటికి తయారు చేస్తామని తెలిపారు. 21లక్షల 9వేల రూపాయలతో ఇంతటి ఖరీదైన చీర కొనుక్కోవడం అవసరమా అని ప్రశ్నిస్తే కొనుగోలు చేసే వాళ్ల అభిరుచిని బట్టి మేం తయారు చేస్తాం అని తెలిపారు. పైగా ఈ చీరను ఒకే వైర్ పై తయారు చేశారని, అందులో అమర్చిన నెట్ కూడా ప్రత్యేకమైనది తెలిపారు. ఇటువంటిదే మరోచీర మా షాపులో ఉందని దాని ఖరీదు రూ.10 లక్షలు అని తెలిపారు. దాదాపు అంతే ధరతో మరో చీర కోసం ఆర్డర్ వచ్చింది ఆ చీరను తయారీలో ఉందని తెలిపారు. ఈ చీర బోర్డరే రెండు లక్షలు ఖరీదు ఉంటుందన్నారు. దీనిని సన్యాసినులు తమ చేతులతో స్వయంగా తయారు చేశారని 32 రకాల చికన్ వర్కులు ఈ చీరలో ఉన్నాయని తెలిపారు. ఈ చీర ఇంత ఖరీదు కావటానికి అదో ప్రత్యేక కారణమని తెలిపారు. https://t.me/offerbazaramzon
లక్నో రాయల్ చీర ఖరీదు రూ.21.9 లక్షలు !
July 13, 2023
0
Tags