తెలంగాణ వ్యాప్తంగా రానున్న ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 13 వరకు విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల్లోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాది రాష్ర్టాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాలు నీటమునిగి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. https://t.me/offerbazaramzon
13 వరకు విస్తారంగా వర్షాలు !
July 10, 2023
0
Tags