చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగించే తేదీని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తాజా ప్రకటన చేశారు. ఈ నెల 13వ తేదీన ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. నిర్దేశిత గడువు నాడు వాతావరణం అనుకూలించకపోతే రెండో ఆప్షన్ కింద 19వ తేదీని ఖరారు చేసినట్లు చెప్పారు. 13వ తేదీ నాడే చంద్రయాన్ 3 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించడానికి అన్ని ఏర్పాటు చేస్తోన్నామని అన్నారు. ప్రయోగించిన తేదీ నుంచి 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ రాకెట్. ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేలా ఇస్రో ప్రణాళికలను వేసుకుంది. రోవర్‌ను మోసుకెళ్లడానికి జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3ని ఇస్రో వినియోగించనుంది. రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయాలనేదే తమ ప్రయత్నమని సోమనాథ్ వివరించారు. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు పునరావృతం కానివ్వకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోన్నామని చెప్పారు. గతంలో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైన విషయం తెలిసిందే. ఇందులో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టలేకపోయింది. చిట్ట చివరి నిమిషంలో గతి తప్పింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు కూలింది. ఇప్పుడు తాజాగా చంద్రయాన్ 3 మిషన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు. ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లడానికి అవసరమైన లాంచింగ్ వెహికల్ క్రయోజనిక్ ఇంజిన్ సీ-20ని విజయవంతంగా పరీక్షించారు. 25 నిమిషాల పాటు దాన్ని మండించారు. తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ లో టెస్ట్ ఫైర్ ఇదివరకే పూర్తయింది. https://t.me/offerbazaramzon
13న చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగం !
July 03, 2023
0
Tags