రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ ఇంటికి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మంది వాంగ్మాలాలు నమోదు చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ గోండాలోని బ్రిజ్‌భూషణ్ ఇంటికొచ్చారు. సాక్ష్యాధారాల కోసం వాంగ్మూలం ఇచ్చిన వారి పేర్లు, చిరునామా, గుర్తింపు కార్డులను సేకరించారు. అలాగే, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ మద్దతుదారుల్లో పలువురిని ప్రశ్నించారు. ఈ కేసులో 'సిట్' ఇప్పటి వరకు 137 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. అయితే, సింగ్‌ను కూడా పోలీసులు విచారించారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.
బ్రిజ్ భూషణ్ ఇంటికి ఢిల్లీ పోలీసులు
June 06, 2023
0
Tags