విద్యార్థినులపై హెడ్ మాస్టర్ అఘాయిత్యం!

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని దుంగార్ పూర్‌లో సభ్య సమాజం తల దించుకునేలా ఓ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రవర్తించాడు. ప్రభుత్వ పాఠశాలలో ఓ హెడ్ మాస్టర్‌గా ఉన్న రమేశ్ చంద్ర కటారా విద్యార్థినులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు, చిప్స్ ఆశ చూపించి తన కోరిక తీర్చుకునేవాడు. రమేశ్ చంద్ర బూతు వీడియోలు చూస్తూ ఉండేవాడు. బడిలో 8 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండే విద్యార్థినులను టార్గెట్ చేసి రేప్ చేసేవాడు. స్కూల్‌కి సెలవు ఉన్న రోజుల్లో కూడా ఆడుకోవడానికి విద్యార్థినులను పిలిపించేవాడు. తన ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో అక్కడికి తీసుకెళ్లి రేప్ చేసేవాడని పోలీసులు నిర్ధారించారు. ఒప్పుకోని పిల్లలను బెదిరించేవాడని తెలిపారు. ఆ తర్వాత డబ్బులు పిల్లలకు చాక్లెట్లు, చిప్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవాడని చెప్పారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురైయ్యారు. కామాంధునికి కఠిన శిక్ష వేయాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)