అట్టహాసంగా అభిషేక్ అంబరీష్ వివాహ రిసెప్షన్

Telugu Lo Computer
0


నటి సుమలత తనయుడు అభిషేక్ వివాహం మోడల్, ఫ్యాషన్ డిజైనర్ అవివాతో గ్రాండ్‌గా జరిగింది. తాజాగా వీరి పెళ్లి రిసెప్షన్ బెంగళూరులో గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహా రిసెప్షన్‌ను శాండిల్‌వుడ్‌కు చెందిన అతిరథ మహారథులతో పాటు కర్ణాటకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  వీరి వివాహా రిసెప్షన్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, శాండల్‌వుడ్ సూపర్ స్టార్ రవిచంద్రన్ రిసెషన్‌కు చేరుకుని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా వచ్చారు. ఈ వివాహా వేడుకకు లైట్ గోల్డ్ కలర్ షేర్వానీలో అభిషేక్ అంబరీష్ మెరిసిపోయాడు. ఇక గోల్డ్ కలర్ చీరలో అవివా స్టేజ్ పై బంగారు బొమ్మలా చూపురలను కనువిందు చేశారు. అభి-అవివా విలాసవంతమైన రిసెప్షన్ కోసం, రోమన్ థీమ్‌లో గ్రాండ్ స్టేజ్ ఏర్పాటు చేయబడింది. వేదికను లావెండర్ పర్పుల్, గ్రే కలర్ కాంబినేషన్, ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ ఉపయోగించి అలంకరించారు. గ్రే కలర్ కార్పెట్ పరిచారు. ఈ వివాహా రిసెప్షన్‌కు కర్ణాటక మాజీ సీఎం బసవరాజ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప, గులాం నభీ ఆజాద్, సీఎం సిద్ధరామయ్య, శతృఘ్నసిన్హా సహా పలువురు రాజకీయ నాయకులు కొత్త జంట అయిన అభి-అవివకు శుభాకాంక్షలు తెలిపారు.  అభిషేక్ రిసెప్షన్ కోసం 3000 సీట్లు ఏర్పాటు చేశారు. 25 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. వీవీఐపీ, వీఐపీలకు వేర్వేరుగా భోజన ఏర్పాట్లు చేశారు. అభిషేక్-అవివా రిసెప్షన్ కోసం శాఖాహార భోజనం సిద్ధం చేశారు. 34 రకాల వంటకాలు కూడా తయారు చేస్తారు. సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు అందరికీ ఒకే రకం భోజనం వడ్డించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)