చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో ఇన్ఫార్మర్స్ నెపంతో ఇద్దరిని మావోయిస్టులు హత్య చేశారు. బుర్కాపాల్ పంచాయితీ ఉపసర్పంచ్ మడవి గంగతో పాటు మరో 14 మంది గ్రామస్తులను తాడిమెట్ల గ్రామం నుంచి మావోయిస్టులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. వీరిలో ఉపసర్పంచ్ మడవి గంగా మరియు టీచర్ కావసి సుక్కాను నిన్న ప్రజా కోర్టు నిర్వహించి ఇన్ ఫార్మర్స్ నెపంతో హత్య చేశారు. కాగా.. మరో 13 మంది గ్రామస్తులు ఇంకా మావోయిస్ట్‌ల చెరలోనే ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అగ్రనేతలతో మాట్లాడి తమను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
ఇన్ఫార్మర్ల పేరుతో ఉపసర్పంచ్, టీచర్ హత్య !
June 29, 2023
0
Tags