ఈ-ఆటో డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం !

Telugu Lo Computer
0


పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ-ఆటోలను) ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు వీలుగా వీటిని సిద్దం చేసారు. ఆటోల నిర్వాహణపై డ్రైవర్లను, అధికారులను సీఎం జగన్ ఆారా తీసారు. 'ఈ- ఆటోల' డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. వీటిని 36 మున్సిపాల్టీలకు పంపిణీ చేస్తారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ-ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టీలకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ 'ఈ- ఆటోల' డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్‌-1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్‌ టిప్పర్లను వినియోగిస్తోంది. గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది. త్వరలో రోజుకు 400 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. రూ.157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు నిరి్మస్తున్నారు. 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్‌ టు కంపోస్ట్, నాలుగు బయో మిథనేషన్‌ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్‌లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ-ఆటోలు ప్రవేశపెడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)