హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం !

Telugu Lo Computer
0


దుండిగల్‌లో శనివారం ఉదయం జరిగే ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు హాజరైందుకు  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జీహెచ్ఎంసీ మేయర్ కూడా ఉన్నారు. కాగా, ద్రౌపది ముర్ము విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకొని, రాత్రికి అక్కడే బస చేయనున్నట్టు తెలుస్తోంది. కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు రీవ్యూయింగ్‌ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ముర్ము హాజరవుతారు. పరేడ్‌ అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)