ఫైవ్ స్టార్ హోటల్ లో ఘరానా మోసం !

Telugu Lo Computer
0


ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టుకి దగ్గర్లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ లో అంకుశ్ దత్త అనే వ్యక్తి 2019 మే 30వ తేదీన ఫస్ట్ టైమ్ దిగాడు. ఒక్కరాత్రికి బుక్ చేసుకున్న ఆ వ్యక్తి.. మరుసటి రోజు చెకౌట్ చేయాలి. కానీ అప్పటి నుంచి ఎక్స్ టెండ్ చేస్తూ 2021 జనవరి 22 వరకూ అక్కడే ఉన్నాడు. అయితే హోటల్‌కి ఎవరు వచ్చిన 72 గంటల్లో బిల్ కట్టకపోతే, ఆ విషయం వెంటనే సీఈవో వరకూ వెళ్తుంది. అయితే ఫ్రంట్ ఆఫీస్ హెడ్ మాత్రం ఇది ఎవరి దృష్టికీ వెళ్లకుండా మేనేజ్ చేశాడు. నిందితుడు దత్త హోటల్‌కి మొత్తం మూడు చెక్స్ ఇచ్చాడు. రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షల చెక్‌లు ఇవ్వగా అవన్నీ బౌన్స్ అయ్యాయి. ఆ విషయం కూడా పై అధికారులకు తెలియదు. మరోవైపు ఆ చీటర్ పారిపోవడానికి హోటల్‌ ఫ్రంట్ ఆఫీస్ హెడ్ ప్రేమ్ ప్రకాశ్ సహకరించినట్టు హోటల్ ఓనర్ ఆరోపించాడు. హోటల్‌లో ఎవరెవరు ఉంటారన్న విషయం..? ఎవరెవరికి యాక్సెస్ ఉంది అనేది పూర్తిగా ప్రేమ్ ప్రకాశ్ కు తెలుస్తుందన్నాడు. అతని సహకారం లేకుండా నిందితుడు అన్ని రోజులు హోటల్‌లో ఉండే అవకాశమే లేదని చెబుతున్నాడు. ఓవర్‌ స్టే చేసేందుకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నాడు. అంతేకాకుండా ఎవరికి తెలియకుండా హోటల్ సాఫ్ట్‌వేర్‌ని కూడా తన ఆధీనంలో ఉంచుకొని, ఈ నేరానికి పాల్పడ్డారని  హోటల్ యజమాని మల్హోత్రా చెబుతున్నాడు. అయితే ఈ ఇద్దరి నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని హోటల్ యాజమాన్యం చూస్తోంది. ప్రాథమిక విచారణలో నిందితులెవరో గుర్తించామని, విచారణ పూర్తైన తరవాత తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)