అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్ దోపిడీని ఇంకెంతకాలం భరిద్దామని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన పేర్కొన్నారు. అన్నివర్గాల పోరాటాలు, త్యాగంతోనే తెలంగాణ వచ్చిందని అంటూ కేసీఆర్ కుటుంబమే తొమ్మిదేళ్లుగా పాలిస్తూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని , అలాగే తొమ్మిదేళ్ల లో రూ.17 లక్షల కోట్లను బడ్జెట్‌లో చూపారని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం రూ.22 లక్షల కోట్లని అంత డబ్బు ఖర్చు చేసినప్పుడు తెలంగాణ ప్రజల జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదని ఆరోపించారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కూ ఓ అవకాశం ఇవ్వండి !
June 03, 2023
0
Tags