ముంబైలో ఎడతెగని వాన !

Telugu Lo Computer
0


ముంబై  నగరంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. గత ఆదివారం నుంచి ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ముంబైలోని లోతలోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అంధేరీ సహా పలు ఏరియాల్లోని అండర్‌పాస్‌లు, సబ్‌వేలలో వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం కూడా అంధేరీలో భారీ వర్షం పడటంతో సబ్‌వేలో భారీగా వరదనీరు నిలిచింది. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో నీటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ ముంబైలో జూన్‌ నెలలో కురువాల్సిన వర్షాల్లో 97 శాతం కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)