ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రమాదంలో గాయపడి కటక్‌లోని చికిత్స పొందిన బాధితులను ఆయన శనివారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బాధితులను స్వయంగా కలుసుకున్నానని, వారికి అన్నివిధాల వైద్యసాయం అందించి ఆదుకుంటామని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని, ఏ ఒక్క కోణం వదలి పెట్టకుండా సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఈ ఘటనకు కారణకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ యుద్ధపాత్రిపదికన పునరుద్ధరిస్తోందని తెలిపారు. దీనికి ముందు, బాలాసోరో జిల్లాలో రైలు ప్రమాద దుర్ఘటనా స్థలిని ప్రధాని సందర్శించారు. పరిస్థితిని సమీక్షిస్తు్న్న కేంద్రం మంత్రులు, రైల్వే అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు. కాగా, బాలాసోర్ రైలు ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గత మూడేళ్లుగా ఒక్క రైలు ప్రమాద ఘటన కూడా చోటుచేసుకోలేదని తెలిపారు. బాలాసోర్ ఘటన తనకు, తమ ప్రభుత్వానికి ఎంతో ఆవేదన కలిగించిందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నిర్దేశకత్వంలో రైల్వే మంత్రి స్యయంగా ప్రమాద స్థలిలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తు్న్నారని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
రైలు దుర్ఘటన నన్ను ఎంతగానో కలిచివేసింది
June 03, 2023
0
Tags