రెండు ప్రైవేట్‌ బస్సులు దగ్ధం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రైవేట్‌ బస్సులు షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా దగ్ధమయ్యాయి. బాలానగర్‌ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్‌ వైపు వెళుతున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైన సంఘటన కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద చోటు చేసుకుంది. బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌ ప్రయాణికులను కిందకు దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ కారణంగా బాలానగర్‌ నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం బీరంగూడ నుంచి కూకట్‌పల్లి వైపు వస్తుండగా మదీనాగూడ ప్రాంతంలో బస్సు ఇంజిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన స్థానికులు, వాహనదారులు బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో అతను బస్సును జాతీయ రహదారి పక్కన ఆపి ఫైర్‌ ఇంజిన్‌కు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)